వార్తలు మమ్మల్ని సంప్రదించండి
తెలుగు
  • KJV
  • தமிழ்
  • ಕನ್ನಡ
  • हिन्दी
జెఫన్యా
  • ఆదికాండము
  • నిర్గామకాండము
  • లేవీకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితియోపదేశకాండము
  • యెహోషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1 దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు
  • కీర్తనలు
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతము
  • యెషయా
  • యిర్మియా
  • విలాపవాక్యములు
  • యెహేజ్కేలు
  • దానియేలు
  • హోషేయా
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
  • మత్తయి
  • మార్కు
  • లూకా
  • యోహాను
  • అపో. కార్యములు
  • రోమీయులకు
  • 1 కోరింథీయులకు
  • 2 కోరింథీయులకు
  • గలతియులకు
  • ఎఫెసీయులకు
  • ఫిలిప్పీయులకు
  • కొలస్సీయులకు
  • 1 థెస్సలొనికయులకు
  • 2 థెస్సలొనికయులకు
  • 1 తిమోతికి
  • 2 తిమోతికి
  • తీతుకు
  • ఫిలేమోనుకు
  • హెబ్రీయులకు
  • యాకోబు
  • 1 పేతురు
  • 2 పేతురు
  • 1 యోహాను
  • 2 యోహాను
  • 3 యోహాను
  • యూదా
  • ప్రకటన గ్రంథం
3
  • 1
  • 2
  • 3
1 ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.
2 అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాస ముంచదు, దాని దేవునియొద్దకు రాదు.
3 ​దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధి పతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.
4 ​దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువు లను అపవిత్రపరతురు.
5 ​​అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు
6 నేను అన్య జనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసి యున్నాను, జనము లేకుండను వాటియందెవరును కాపుర ముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.
7 దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులు కలిగి శిక్షకులోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.
8 కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నాకోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమ కూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.
9 అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.
10 చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసి కొని రాబడుదురు.
11 ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతో షించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు
12 దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండ నిత్తును.
13 ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతిగల వారై అన్నపానములు పుచ్చుకొందురు;
14 సీయోను నివాసు లారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.
15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.
16 ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;
17 నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.
18 నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.
19 ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను,
20 ఆ కాలమున మీరు చూచు చుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.
‹
© 2025 DailyManna.co.in. All rights reserved.